గౌతమి నగర్ లో అనుమతి లేని కట్టడాన్ని రామగుండం నగర సంస్థ కూల్చివేసింది. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కమీషనర్ (ఎఫ్ ఎ సి ) అరుణ శ్రీ ఆదేశాల మేరకు రామగుండం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది బుధవారం ఉదయం గౌతమి నగర్ లోని ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో పర్లపెల్లి సందీప్ అనే వ్యక్తి నిర్మిస్తున్న అనధికార కట్టడాన్ని కూల్చివేశారు. నోటీస్ జారీ చేసినప్పటికీ సదరు భవన నిర్మాణ యజమాని స్పందించలేదని పట్టణ ప్రణాళికా విభాగం ఎ సి పి శ్రీధర్ ప్రసాద్ , టి పి ఎస్ నవీన్ తెలిపారు. నగర పాలక సంస్థ అనుమతి పొందిన తరువాతనే భవన నిర్మాణాలు చేపట్టాలని వారు సూచించారు.
గౌతమి నగర్‌లో అనుమతి లేని కట్టడాన్ని కూల్చివేత
