జిల్లాలోని ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంబించాలని వలసలు నివారించాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మికసంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న డిమాండ్ చేసారు. మంగళవారం దేవరాపల్లి లో కూలీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అనంతరం వారు మాట్లాడారు. జిల్లాలోని కూలీలకు పనులు లేక వలసలు పోయి ప్రమాదాలు వలన చనిపోతున్నారని తెలిపారు. ఇప్పటికే అనేక గ్రామాలు కాలి అయ్యి, ఇతర జిల్లాలాకు ఇతర రాష్ట్రలకు వలసలు పోతున్నారని తెలిపారు. ఆదుకోవలసిన ప్రభుత్వ మీనమేషాలు లెక్కిస్తుందని తెలిపారు. ప్రభుత్వ కూలిలకు ఇచ్చిన 300 రూ కూలి ఎమూలకు సరిపోదని తెలిపారు. నిత్యావసర వస్తువులు ధరలు కరంట్ చార్జీలు వీపరింతంగా పెరిగి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా,రోజుకు 600 కూలి, 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేసారు. మేటిరియల్ చార్జీలు పెంచి కూలిలు పోట్ట గోడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ కూలిలకు ఇవ్వవలసిన అన్నిరకాల ఎలవెన్సులు నిలిపి వేసిందన్నారు. బడ్జెట్లో నిధులు కోరత విదించి కూలీలను చిన్నచూపు చూస్తుందని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉపాధి హమీ చట్టానికి ఉసురు తీసిందని తెలిపారు. లిబ్ టెక్ ఇండియా చేసిన సర్వే ప్రకారం 2023- 2024 ఆర్ధిక సంవత్సరం గాను ఏప్రిల్ సెప్టెంబర్ తో పోల్చినప్పుడు, మన రాష్ట్రంలో 11,8 శాతం పనులు తగ్గాయని ఈ నివేదిక తెలిపిందని అన్నారు. దేశం మొత్తంగా 16 శాతం తగ్గినట్లు వివరించిందని తెలిపారు. గ్రామీణ పేదలు ఆర్దిక అభివృద్ధి కోసం చేసిన ఈచట్టాన్ని కేంద్రం రోజు రోజుకి నాశనం చేస్తుందని తెలిపారు. వెంటనే జిల్లా వ్యాప్తంగా వలసలు నివారించేందుకు పని చేస్తామ్న ప్రతి కూలికి వెంటనే పని కల్పించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఆదిక సంఖ్యలో కూలీలు పల్గోన్నారు.

 
				 
				
			 
				
			 
				
			