తక్షణమే ప్రభుత్వం కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు.
భామిని మండలంలో సుమారు 5000 ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేక దళారిలు సిందికేట్ గా మారి ప్రభుత్వ మద్దతు ధర కంటే క్వింటకు రూ 1500/-తక్కువ ధరకు మించి కొనడం లేదు.
రైతులు పంటపై పెట్టిన పెట్టుబడి రాక తీవ్ర నష్టాలు పాలు అవుతామని చెప్పి ధార వచ్చేంత వరకు తమ నివాస ఇళ్లల్లో పత్తి పంటను దాచుకుంటూ ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియదు భయాందోళనకు గురవుతూ తప్పని పరిస్థితుల్లో ఇళ్లల్లో పెట్టి పత్తిని దాచుకోవలసి వస్తుందని మండలంలో సాగు చేస్తున్న రైతుల యావన్మంది ఆవేదన చెందుతున్నరు.
సమస్య తీవ్రతను బట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారికి ఫోన్లో సంప్రదించగా కొనుగోలు కేంద్రం రాంభద్రపురంలో ఉందని రైతులు అక్కడికి పంటను తెస్తే నిబంధనల ప్రకారం తీసుకుంటామని వారు చెప్తున్నారు.
రాంభద్రపురాని – భామిని కిమధ్య సుమారు 100 కిలోమీటర్ల పైగా దూరం ఉన్నది.రవాణా చార్జీలు తడిసి మోపుడవుతాయని అంతేకాకుండా ఏమైనా సమస్యలు వస్తే ఏమి చేయాలని పరిస్థితి రైతుకు ఎదురవుతుందని రైతుల వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు తక్షణమే భామిని మండలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి పత్తి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇదే విషయాన్ని రేపు పార్వతీపురంలో గౌరవ్ కరెక్ట్ గారిని కలిసి సమస్య తీవ్రతను తెలియడం జరుగుతుందని అప్పటికే స్పందించకపోతే ఆందోళన కార్యక్రమం చేపట్టక తప్పదని అప్పలనాయుడు తెలిపారు.
సంఘం మండల అధ్యక్షులు గురుబిల్లి లక్ష్మీపతి నాయుడు,కొల్ల నాగరాజు ఇంటి వద్ద, కిలారి లక్ష్మణరావు ఇంటి వద్ద పరిశీలిస్తున్న రైతు సంఘం నాయకత్వం.పాల్గొన్నవారు బిడ్డిక విష్ణు, బిడ్డిక కాంతారావు, కొల్ల నాగరాజు, బడితిమాను తవుడు, బాడితి మాను లక్ష్మణరావు, సోలాపూర్ బుడ్డమ్మ, సోలాపూర్ నరసమ్మ (లివిరి గ్రామం) కిల్లరి లచ్చన్న, ఏం పేరు రత్నాల కృష్ణారావు, గురుబిల్లి సుబ్బి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			 
				
			