వివరాల్లోకి వెళ్తే తాళ్లబురిడి గ్రామంలో స్మశాన వాటిక సర్వేనెంబర్; 185 లో మూడు ఎకరాల 88 సెంట్లు గల భూమి ఉండగా కొంతమంది అధికారులు అండదండలతో స్మశాన వాటికనే ఆక్రమించుకోవడం జరిగినది గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు గ్రామంలో ఉండే పెద్దలను అడగడం జరిగినది
గ్రామంలో మండల జడ్పిటిసి స్థాయి నాయకులు ఉన్న మా స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోలేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు
స్మశానంలోకి పాడిని మూసుకొని శవాన్ని తీసుకెళ్లేటప్పుడు అవస్థలు పడుతున్న దృశ్యం
గ్రామంలో 5000 మంది ప్రజలు 3200 ఓటర్సు ఉన్న గ్రామంలో ఇంతవరకు మాకూ స్మశాన వాటిక నిర్మించకపోవడానికి గల కారణమేంటిని ప్రజలు తాళ్లబురిడి గ్రామ పెద్దలని అడుగుతున్నారు
అయ్యా పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ గారినిపార్వతీపురం నియోజకవర్గం శాసనసభ్యులు సంబంధిత అధికారులందరినీ కలిసి చెప్పడమైంది అని గ్రామస్తులు వాపోతున్నారు అయినను మా గ్రామానికి మూడు ఎకరాల 88 సెంట్లు ఉన్న స్మశాన వాటికను కబ్జాదారుల నుంచి విముక్తి చేసి మా స్మశాన వాటికని నిర్మించగలరని ప్రజలు కోరుకుంటున్నారు.

 
				 
				
			 
				
			 
				
			