మెదక్ జిల్లా మనోహర్ మండలంలోని రంగాయం పల్లి గ్రామంలో ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమ విడుదల చేసే నీరు పూర్తిగా కలుషితమవుతోంది.
ఈ కాలుష్యానికి దుర్గంధం వచ్చి గ్రామంలో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు.
గ్రామంలో ఉన్న బోర్ల ద్వారా కలిసిత నీరు రావడం జరుగుతుండడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.
గ్రామస్తులు కంపెనీ ముందు ఆందోళన చేపట్టి, కంపెనీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కంపెనీ నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్థాల కారణంగా పంట పొలాలు దెబ్బతింటున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విధమైన కాలుష్యంతో ఏ ఒక్క పంట కూడా పండించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
బోర్ల ద్వారా వచ్చే కలుషిత నీరు దురదతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
వెంటనే కంపెనీపై చర్యలు తీసుకొని గ్రామస్తులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

 
				 
				
			 
				
			