పాడైపోయిన షవర్మ తిని అస్వస్థతకు గురైన వినియోగదారులు

In Alwal, several consumers fell ill after consuming spoiled shawarma from Grill House. Local authorities demand the closure of the shop for selling unsafe food. In Alwal, several consumers fell ill after consuming spoiled shawarma from Grill House. Local authorities demand the closure of the shop for selling unsafe food.

పాడైపోయిన షవర్మ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంట లో చోటు చేసుకుంది. లోతుకుంట లోని గ్రిల్ హౌస్ లో దసరా రోజు రాత్రి శవర్మా కొనుగోలు చేసిన వినియోగదారులు పాడైపోయిన శవర్మా తిని వాంతులు విరేచనాలు కావడంతో బాధితులు బొల్లారం లోని కంటోన్మెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన లోకేష్, శరత్, గోవిందరాజ్, వర్ధినిలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్తీ ఆహారాన్ని,పాడైపోయిన షవర్మ విక్రయిస్తున్న దుకాణాన్ని మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే షవర్మ సెంటర్ లో కల్తీ ఆహారం తిని, గతంలో కూడా ఇదే తరహా లో పలువురు ఆసుపత్రి పాలయ్యారు. ఆహార భద్రత అధికారులు ఇటీవల నెల రోజులు దుకాణన్ని సీజ్ చేశారు. షవర్మ సెంటర్ ను తిరిగి తెరిచి సరైన ఆహార నాణ్యత పాటించకుండా అదే పాడైపోయిన శవర్మ ను అమ్మడంతో కొనుగోలు చేసి తిన్న వారికి అస్వస్థత,వాంతులు,విరేచనాలు అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *