జర్నలిజం పారదర్శకంగా ఉండాలి. నమస్తే తెలంగాణ దిన పత్రికను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజుల్లోనే రామన్న పరిశ్రమిక ప్రాంతానికి 400 కోట్ల నిధులు తీసుకొచ్చిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు తమ ఎమ్మెల్యే గారిపై వార్తలు రాస్తే ఖబడ్దార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గత ప్రభుత్వం పాలకులను ప్రజలు బొందల గడ్డకు పంపించారు.
గోదావరిఖని: జర్నలిజం అంటే పారదర్శకంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, పాతిపల్లి ఎల్లయ్య ,తిప్పారపు శ్రీనివాస్ గట్ల రమేష్,అన్నారు. ఈ మేరకు గోదావరిఖని పట్టణ చౌరస్తాలో నమస్తే తెలంగాణ పేపర్ ను దహనం చేసి, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఓవైపు అభివృద్ధి చేస్తుంటే మరోవైపు అభివృద్ధి లేదంటూ పిచ్చి పిచ్చి రాతలు రాయడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజుల్లోనే రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి 400 కోట్ల నిధులు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ తీసుకువచ్చారని గుర్తు చేశారు. సింగరేణి కార్మిక కుటుంబాలు బురద నీళ్లు తాగుతుంటే సంస్థ సీ&ఎండీ బలరాం తో మాట్లాడి 20 కోట్ల నిధులతో ఫిల్టర్ బెడ్ (ప్యూరిఫై వాటర్) నిర్మిస్తున్నామని అన్నారు. అదేవిధంగా 100 కోట్లతో ఎస్టీపీ ల కోసం, గోదావరిఖని పట్టణ లక్ష్మీ నగర్ లో అభివృద్ధి కోసం 32 కోట్లు, బండల వాగు నిర్మాణ కోసం 70 కోట్లు నిధులు తెప్పించారని నాయకులు పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్లు తమ ఎమ్మెల్యే పై వార్తలు రాస్తే ఖబర్దార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాతలు రాస్తున్న దినపత్రిక యాజమాన్యానికి ప్రజలే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలకులను ప్రజలు ఇప్పటికే బొందల గడ్డకు పంపించారని అన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ స్థానికంగా చేస్తున్న అభివృద్ధిని అన్ని వర్గాలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
