నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నుండి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బైకాట్ చేసి బయటకు వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు, “ప్రస్తుతం ఉన్న మున్సిపల్ చైర్మన్ గత 15 సంవత్సరాలుగా మున్సిపల్ కజనా దోచుకొని ఎన్నో అవినీతి పనులు చేసి ఈరోజు డ్రామాలు ఆడుతున్నారు” అని విమర్శించారు.
కౌన్సిలర్లు, చైర్మన్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, “దొంగనే, దొంగ దొంగ అని అరవడం ఏంటి?” అని ప్రశ్నించారు. చైర్మన్ గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ కట్టడాలకు పాల్పడుతూ, కమిషన్లు తినడం హాస్యాస్పదమని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, పార్టీ కండువా మార్చి తిరిగి అవినీతిపరులు అధికారంలోకి రాలనుకుంటున్న చైర్మన్, కాంగ్రెస్ పార్టీలోని నిరసనను చూసి కొత్త డ్రామా చేశారని అన్నారు. ఈ కొత్త డ్రామాలతో ప్రజలు మరియు అధికారులు భయబ్రాంతులకు గురి అవుతున్నారని విమర్శించారు.
మున్సిపల్ కాంప్లెక్స్ లో టెండర్లను బ్లాక్ మెయిల్ చేయడం, షాప్స్ వారికీ డబ్బులు వసూలు చేయడం అనే అనుభవం ఉన్న చైర్మన్ గురించి కొందరు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఈ తరహా అవినీతి పరులు రానివ్వరని వారు గట్టిగా నినాదాలు చేశారు.