విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయితి గ్రామంలో శుక్రవారం గ్రామ సచివాలయంలో సర్పంచ్ బెవర మహేశ్వరి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కూర్మనాద్ పట్నాయక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఉపాధి హామీ నిధులు వినియోగించుకుని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఉపాధి హామీ వందరోజుల పనులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ ఆఫీసర్ విమల కుమారి, ఏసి దుర్గాప్రసాద్, పంచాయితీ సెక్రటరీ వాగ్దేవి, టెక్నికల్ అసిస్టెంట్ స్వామి నాయుడు, మాజీ ఎంపీటీసీ టిడిపి నాయకులు ఎంపిటిసి మణిపూర్ రామచంద్రుడు,సతివాడ నారంనాయుడు,జనసేన నాయకులుపొట్టా శేఖర్, బిజెపి నాయకులు మన్నెపురి అప్పలనాయుడు,తదితరులు పాల్గొన్నారు.
జయితి గ్రామంలో గ్రామసభ నిర్వహణ
 In Jayiti village, a village meeting was held under the leadership of Sarpanch Bever Maheshwari, focusing on development and employment guarantee funds.
				In Jayiti village, a village meeting was held under the leadership of Sarpanch Bever Maheshwari, focusing on development and employment guarantee funds.