గుడిమెట్లలో భూముల కబ్జా పై ఆవేదన

Rakesh Reddy from Gudimetla expressed his distress over police involvement in the encroachment of their 19 acres of land in Tirumala Nagar, Moula Ali. Rakesh Reddy from Gudimetla expressed his distress over police involvement in the encroachment of their 19 acres of land in Tirumala Nagar, Moula Ali.

ల్యాండ్ విషయంలో పోలీసులను అడ్డం పెట్టుకొని మా భూములు కబ్జా చేశారని గుడిమెట్ల రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మౌలాలిలోని తిరుమల నగర్ లో ఉండే మా 19 ఎకరాలను గుండాలను పోలీసులను అడ్డం పెట్టుకొని మాభూమిని కబ్జా చేశారని తెలిపారు. 1977లో ఈ ల్యాండ్ ను మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నమని, పహాని కూడా మా పేరు మీద ఉందని అన్నారు. ఇందులో తోటను పెంచం, డైరీ నడిపించడం, క్వారీ బిజినెస్ చేశాం అని అన్నారు. మా ల్యాండ్ లోకి పోకుండా రేకులను అడ్డం పెట్టారని అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ ల్యాండ్ మేము పర్మిషన్ తీసుకుని షెడ్లు కూడా వేసుకున్నామని తెలిపారు. మున్సిపల్ కి అన్ని రకాలుగా టాక్స్లు కడుతున్నామని అన్నారు. ఇప్పుడు ఇందులో కొంతమంది బడా నాయకులు ల్యాండ్ విషయంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మమ్ములను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2010లో మా పొజిషన్ డిస్టర్బ్ చేయాలని రెవెన్యూ వారు ప్రయత్నించారు. అయితే హైకోర్టు స్టేటస్కో ఆర్డర్ ఇచ్చి వాళ్లను డిస్టర్బ్ చేయొద్దని వక్ బోర్డు కు, ఆర్డీవోకు, ఎమ్మార్వోకు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు యూసుఫ్ బేగం కొడుకులు ఈ 300 ఎకరాలు భూమి మాదేనని బడా నాయకులను అడ్డం పెట్టుకొని వేధిస్తున్నారని అన్నారు. ఈ భూమిపై తగు చర్యలు తీసుకొని మా భూమి మాకు ఇప్పించాలని మీడియా సమక్షంలో వేడుకున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *