కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సదాశివ నగర్ మండలం కుప్రియాల్ లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ : వడ్లు శుభ్రం చేసి , ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. ఎన్ని రోజుల క్రితం వరి పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారని రైతులను అడిగారు. ఇప్పటివరకు 1877.20 క్వింటాళ్ల వరి పంటను 54 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్లు , కొనుగోలు చేసిన దానిలో 45 మంది రైతుల వరి ధాన్యం 1652 క్వింటాల్లు రైస్ మిల్లులకు పంపడం జరిగింది , ట్యాబ్ ఎంట్రీ చేసినట్లు సెంటర్ ఇన్చార్జి తెలిపారు. మిగతావి లోడింగ్ జరుగుతున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్ , జిల్లా సహకార అధికారి రాం మోహన్ , జడ్పీ సీఈవో చందర్ , జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి , రైతులు , తదితరులు పాల్గొన్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.
సదాశివనగర్ మండలం కుప్రియల్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. బాలింతతో మాట్లాడుతూ: ఆసుపత్రికి ఎందుకు వచ్చారు అని అడుగగా, వైద్య పరీక్షలకు రావడం జరిగిందని తెలిపారు. రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారు అని డాక్టర్ ఆష్మ ను అడుగగా, సుమారు 30 మంది రావడం జరుగుతున్నదని తెలిపారు. ఆశ లు వారి పరిధిలో అందిస్తున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్ర శేఖర్ పాల్గొన్నారు. పిల్లలకు విద్య బుద్దులు నేర్పించాలని , పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కుప్రీయాల్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ: సామ్ , మామ్ పిల్లలు ఎంతమంది ఉన్నారు. పిల్లలకు , గర్భిణీలకు , బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం వంటి విషయాలు అడిగారు. పిల్లలకు బాలమృతం , పౌష్టికాహారం , అందించడంతో పాటు , ఆట పాటలు నేర్పిస్తున్నమని, పప్పెట్ బొమ్మతో, రికార్డర్ తో ఆటపాటలు నేర్పిస్తున్నామని అంగన్వాడీ టీచర్ తెలిపారు. అనంతరం పిల్లల హాజరు , స్టోర్ రూం లోని సరుకులు , వండిన పదార్థాలన్నీ కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా సంక్షేమ అధికారి చందర్ నాయక్ , సూపర్ వైజర్ పద్మ , తదితరులు పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			