జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజావాణి కార్యక్రమంలో ఆదేశాలు

Collector Abhilash Abhinav directed officials to address public issues quickly during the Prajavani program, focusing on education, health, and agriculture. Collector Abhilash Abhinav directed officials to address public issues quickly during the Prajavani program, focusing on education, health, and agriculture.

ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ముఖ్యంగా విద్యా ,వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్ల వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ ఆర్జీలను సమర్పించారు. ప్రధానమంత్రి జన సురక్ష యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ పథకం వల్ల కలిగే లాభాల గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకానికి అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డిఆర్ఓ భుజంగరావు ,వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *