అక్టోబర్ 24వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు పాలకొండ ఇరిగేషన్ కార్యాలయం ఎదురుగా జరిగిన రైతుల ఆందోళనకు సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాలకొండ మండలం వ్యవసాయ భూములకు తోటపల్లి ఎడమ కాలువ 7, 8 బ్రాంచ్ ల వివిధ గ్రామాల ఆయకట్టు రైతులకు సాగునీరు తక్షణమే అందించాలని, సాగునీరు సకాలంలో అందక నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపుకు తగు చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు ఆయకట్టు రైతులకు ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ,చివర ప్రాంతాలకు నీరు నేటి వరకు అందలేదని తక్షణమే నీరు అందించుటకు తగు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన తీవ్రతం చేస్తామని ఆయకట్టు రైతు చేస్తున్న ఆందోళనకు సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తుందని, రైతు సమస్యలు పరిష్కారానికి రైతులతో కలిసి కార్మిక వర్గం ప్రత్యక్ష కార్యచరణ చేపడుతుందని, ఈ సందర్భంగా అన్నారు. ఆయకట్టు రైతులు ప్రతినిధి కండా ప్రసాదరావు, కండాప్రకాష్ రావు మాట్లాడుతూ, పాలకొండ రుద్ర పేట ఎనిమిదవ బ్రాంచ్ వివిధ గ్రామాలకు ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని అనేక పర్యాయాలు అధికారులు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ పరిష్కారం చేస్తామని హామీలు తప్ప నేటికీ ఒక చుక్క నీరు ఇవ్వలేదని, ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఇరిగేషన్ ఏ .ఈ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏ.ఈ మాట్లాడుతూ లాస్కర్లు తగు సిబ్బంది లేనందువలన సకాలంలో ఆయికట్టు రైతులకి నీరు అందించలేకపోయామని రైతులు సహాయంతో సాగునీరు అందించే ప్రయత్నం కొన్ని గ్రామాలకు చేశామని ,సాగునీరు అందని గ్రామాలకి రేపటి నుండి నీరు అందించే చర్యలు చేపడతామని ,హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కరణం అప్పారావు, బి. సోమశేఖర్ ,చీర రామకృష్ణ ప్రసాదు పాలకొండ మండలం రుద్రపేట,పాలకొండ ఆయికట్టు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రైతుల ఆందోళనకు సిఐటియు మద్దతు
CITU district president participated in farmers' protest in Palakonda, demanding immediate irrigation water supply and compensation for losses.
