పార్వతీపురం మన్యం జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో తోపుడు బండ్ల వ్యాపారులకు ఉపాధి కల్పించాలని నాలుగు రోడ్ల కోడలి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం జిల్లా రెవిన్యూ అధికారి కే. హేమలత గారికి వినతిపత్రం సమర్పించారు.
నాయకులు మాట్లాడుతూ, పట్టణ పోలీస్ సర్కిల్ అధికారులు ట్రాఫిక్ అంతరాయం పేరుతో చిల్లర వర్తకులను తొలగించినందున వారు ఉపాధి కోల్పోయారని, 20 రోజులుగా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ చర్య వల్ల వారి జీవనాధారం నశించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి లేకుండా దినసరి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. వ్యాపారులను రక్షించకుండా వారు ఇబ్బందులు పడడం అన్యాయమని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని తోపుడు బండ్ల వ్యాపారులు మరియు చిల్లర వర్తకులకు తగిన ఉపాధి కల్పించాలనే డిమాండ్ చేస్తున్నారు. వారి బ్రతుకుల కోసం ప్రభుత్వం స్పందించాలని ప్రదర్శనలో పాల్గొన్న వారు కోరారు.
