డిసెంబర్ 8వ తేదీన విశాఖపట్నంలో జరుగు మాలల గర్జన సభకు తరలిరావాలని మాలల గర్జన నర్సీపట్నం డివిజన్ ఆర్గనైజర్ చిట్ల చలపతిరావు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన నాతవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబీసీ వర్గీకరణ వద్దు దళితుల ఐక్యతే ముద్దు అని, మాలల వేరు మాదిగల వేరు కాదని ఆయన అన్నారు.
దళితులంతా ఒకటేనని, మాలలకి చిపరిచే విధంగా మందకృష్ణ మాదిగ మాట్లాడడం తగదని ఆయన అన్నారు. మందకృష్ణ మాదిగ, నాయకులు అంతా కలిసి విభజించి పాలించాలని చూస్తున్నారని, అందుకు మాలలంతా ఏకం కావాలని, విశాఖపట్నంలో జరగబోయే మాలల గర్జన సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.