బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఛావా’ ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించింది. ప్రముఖ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మించారు. మహారాష్ట్ర సింహం ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్రం విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. హిందీలో మాత్రమే ఈ సినిమా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. స్ఫూర్తిదాయకమైన కథ, ఆకట్టుకునే నటన సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచాయి.
తెలుగు ప్రేక్షకుల కోసంగా గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని మార్చి 7న డబ్బింగ్ చేసి విడుదల చేసింది. తెలుగు వర్షన్ కూడా మంచి స్పందన అందుకుంది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటన ప్రేక్షకుల మన్ననలు పొందింది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఛావా’ మూవీ స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు భారీ ఎత్తున ఆసక్తి కనబరిచారు.
