దామరచర్ల మండలం గణేష్ పహాడ్ గ్రామ శివారులో పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీని 2004 సంవత్సరంలో చాణిక్య సిమెంట్ పేరుతో నెలకొల్పారు తర్వాత పెన్నా సిమెంట్ గా పేరు మార్చారు కర్మాగార యజమాన్యం స్థానికులను మభ్యపెడుతూ సిమెంట్ పరిశ్రమలను నడుపుతున్నది. ఇటీవల పెన్నా సిమెంట్ కర్మగారాన్ని అదానీ గ్రూప్ కొనుగోలు చేసి అంబుజా గా పేరు మార్చి పెన్నా సిమెంట్ మైనింగ్ లీజు గడువు గత 2022లో ముగియడంతో కొంతకాలం అనాధికారికంగా నడిపింది స్థానికులు ఫిర్యాదు చేయడంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తనిఖీలు నిర్వహించే సిమెంట్ ఉత్పత్తిని నిలుపుదల చేసింది.
పెన్నా సిమెంట్ ను అదానీ కొనుగోలు చేసి తన సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు 304 హెక్టార్ల భూమిలో సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్ గ్రామ పరిధిలో 50 హెక్టార్ల మైనింగ్ నాపరాయి గనుల విస్తీర్ణాన్ని 1.5 మిలియన్ టన్నుల నుంచి 1.8 మిలియన్ టన్నులకు పెంచేందుకు సన్న హాలు చేస్తున్నది అందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు దరఖాస్తు చేసుకుంది ఈ మేరకు తోలుతా ఈనెల 12న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ప్రకటించగా కొడంగల్ లో జరిగిన సంఘటన నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణను ఈ నెల 29వ తేదీకి మార్చింది.

 
				 
				
			 
				
			