ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. ఈ భేటీలో రైతు రుణాలు, సంక్షేమ పథకాలకు బ్యాంకుల సహకారం తదితర అంశాలపై సమీక్షించనున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ సామాన్య ప్రజలకు మరింత చేరువ కావాలనే దిశగా కీలక సూచనలు చేయనున్నారు.
రైతుల రుణ మాఫీ, పథకాల అమలులో బ్యాంకుల బాధ్యతలు ముఖ్యాంశంగా చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు బ్యాంకుల భాగస్వామ్యం ఎలా ఉండాలన్నదానిపై సీఎం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. బ్యాంకింగ్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరాన్ని సీఎం హైలైట్ చేయనున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థంగా అందించేందుకు బ్యాంకులు కీలక పాత్ర పోషించాలి. ప్రజలకు లబ్ధి చేకూరేలా రుణాలు మంజూరు చేయడం, బ్యాంకింగ్ సేవలను విస్తరించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా రైతులకు రుణసహాయం అందించడంపై ప్రత్యేక చర్చ జరుగనుంది.
ఈ సమావేశంలో బ్యాంకు ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. బ్యాంకింగ్ సేవల లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన సూచనలు అందించనున్నారు.
