హోళగుంద మండల మైనారిటీ నాయకులు ఇమామ్లు, మౌజన్లకు వేతనాల కోసం నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీల సంక్షేమంలో భాగంగా రూ.45 కోట్ల నిధులను విడుదల చేయడం ఎంతో ప్రశంసనీయమని అన్నారు. మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్న చంద్రబాబు ప్రభుత్వం, మైనారిటీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటోందని మండల మైనారిటీ నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అబ్దుల్ సుభాన్, వాహిద్, మోయిన్, జాకీర్, ముల్లా వలి, డాక్టర్ ఖాసిం, శాలి అమాన్ తదితరులు పాల్గొన్నారు. ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనం అందించడం ముస్లిం మైనారిటీల అభివృద్ధికి చేపట్టిన కీలక నిర్ణయమని వారు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలో మైనారిటీలకు అనుకూలమైన పాలన కొనసాగుతుందని, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు త్వరలో అమలు చేయాలని కోరారు.
ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రంజాన్ మాసం సందర్భంగా గంట ముందే కార్యాలయాల నుండి వెళ్లేందుకు అనుమతి ఇచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం ముస్లిం సిబ్బంది కోసం తీసుకున్న మంచి చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు మైనారిటీల అభివృద్ధికి నిస్వార్థంగా కృషి చేస్తున్నారని, ఆయన తీసుకున్న నిర్ణయాలు ముస్లిం సమాజానికి ఎంతో మేలు చేస్తున్నాయని మైనారిటీ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెదేపా మైనారిటీ నాయకులు శాలి మహబూబ్ బాషా, ఇలియాస్, అబ్దుల్ రహిమాన్, హేసన్, అమన్, సలీం, దూదేకుల సంఘం నాయకులు హుస్సేన్ పీరా, బడే సాబ్, మౌలాలి, హసేన్ సాబ్, దాదావలి, సాయిబేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మైనారిటీ శాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ కు, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ కు, ముస్తాక్ అహ్మద్ కు, ఆలూరు ఇన్‌చార్జ్ వీరభద్ర గౌడ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
