కామారెడ్డిలో బతుకమ్మ సంబరాల ఉత్సవం

The Bathukamma festival was celebrated in Kamareddy, emphasizing women's empowerment and participation in community activities. The Collector awarded prizes to outstanding women's groups. The Bathukamma festival was celebrated in Kamareddy, emphasizing women's empowerment and participation in community activities. The Collector awarded prizes to outstanding women's groups.

కామారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ : బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

మహిళాశక్తి కార్యక్రమాన్ని ప్రతీ మహిళా సద్వినియోగం చేసుకోవాలని , కుటుంబం , పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు.

స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వ్యాపార రంగంలో రాణించాలని తెలిపారు.

బతుకమ్మ కార్యక్రమంలో మహిళలు పాల్గొనడం అభినందనీయమన్నారు.

ఉత్తమ మహిళా సంఘాలకు కలెక్టర్ బహుమతులను అందించారు.

మొదటి బహుమతి బిక్కునూర్ మండలం మహిళా సంఘం , ద్వితీయ బహుమతి మాచారెడ్డి మండలం మహిళా సంఘం,

తృతీయ బహుమతి సదాశివ నగర్ మండలం మహిళా సంఘం లకు బహుమతులు సాధించారు.

ఈ వేడుకల్లో 10 మండలాలు నుండి సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు.

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మహిళలతో బతుకమ్మ ఆడారు.

తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే బతుకమ్మ పాటలు , ఆటలు ఆడారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి , జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ , సి.పి.ఒ. రాజారాం , జిల్లా సంక్షేమ అధికారి బావయ్య , జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు రాజమణి , డి.పి.ఏం. సుధాకర్ , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *