- సాంప్రదాయ బద్దంగా దిపాలళి పండుగ జరుపుకుందాం.
- ఎకో వైజాగ్ ను జయప్రదం చేయండి.
- పశు, పక్ష్యాదులకు హాని కలిగించ వద్దు.
- డాక్టర్ ఎం కాసు, ప్రిన్సిపాల్, ఎ ఎస్ రాజా వుమెన్స్ జూనియర్ కళాశాల
దిపావళి పండుగ పర్యావరణ హితంగా నిర్వహించుదాం అని ఎ ఎస్ రాజా వుమెన్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం కాసు అని అన్నారు. గురువారం సాయంత్రం ఎ ఎస్ రాజా వుమెన్స్ జూనియర్ కళాశాలలో విద్యార్ధులతో గ్రీన్ క్లైమేట్ టీం, సిఫా సంస్థలు పర్యావరణ హిత దీపావళి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దీపాల పండుగను పర్యావరణ హితంగా సాంప్రదాయ బద్దంగా జరుపుకుందాం అన్నారు. ఎకో వైజాగ్ ను జయప్రదం చేయాలని కోరారు. పశు, పక్ష్యాదులకు హాని కలిగించ వద్దని వేడుకున్నారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పర్యావరణ హితంగా దివ్వెల పండుగ నిర్వహిద్దాం అని పిలుపునిచ్చారు. దివ్వెల పండుగ రోజున కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలన్నారు. పశు, పక్ష్యాదులకూ, వృద్ధులకూ, పిల్లలకూ హాని కలగకుండా చూడాలని అన్నారు. ఒకే రోజు లక్షలాదిమంది బాణాసంచా కాల్చితే కలిగే నష్టాలు వర్ణనాతీతం అని వివరించారు.
ఈ కార్యక్రమంలో సిఫా సంస్థ ప్రతినిధులు హేమ, నర్సింగ్, భాస్కర్ లు, కళాశాల బోటనీ లెక్చరర్ కె శ్వాతి, హింది లెక్చరర్ కృష్ణ వేణి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పి సుశీల, ఆంధ్రా యూనివర్సిటీ సోషల్ వర్క్ విద్యార్థినులు బి ఉషారాణి, బి తేజస్విని, ఆడమ్ బి సార్, బి చైతన్య సరస్వతి, గ్రీన్ వాలంటీర్ జె రాజేశ్వరి తదితరులు పాల్గొని మాట్లాడారు.