సెల్ ఫోన్ కోల్పోయిన వారు ఇప్పుడు సీఈఐఆర్ యాప్ ద్వారా తమ ఫోన్‌ను తిరిగి పొందే అవకాశం ఉంది. రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం, సెల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ యాప్‌లో నమోదు చేసుకుంటే, పోలీసు విభాగం ఫోన్‌ను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేస్తుంది. శనివారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో 12 మంది బాధితులకు పోలీసులు తిరిగి సెల్ ఫోన్లు అప్పగించారు.
ఈ సందర్భంగా రూరల్ ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం టెలికం సంస్థ ద్వారా సీఈఐఆర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పారు. ఈ యాప్ ద్వారా తమ మొబైల్ ఫోన్ వివరాలు నమోదు చేస్తే, పోలీసులు పరిశీలించి స్వాధీనం చేసుకున్న ఫోన్లను యజమానులకు తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ఇప్పటికే ఈ యాప్ ద్వారా అనేక మంది తమ ఫోన్లు తిరిగి పొందినట్లు ఎస్సై పేర్కొన్నారు. ప్రజలు తమ మొబైల్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించడంతో పాటు, సీఈఐఆర్ యాప్‌లో వివరాలు నమోదు చేస్తే, ఫోన్ మరల పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రభాకర్, రమేష్ పాల్గొన్నారు. ప్రజలు సీఈఐఆర్ యాప్ గురించి మరింత అవగాహన పెంచుకొని ఉపయోగించుకుంటే, తమ పోయిన సెల్ ఫోన్లు తిరిగి పొందే అవకాశాలు మెరుగవుతాయని అధికారులు సూచించారు.
