చంద్రబాబు పాలనలో రైతులు సుభిక్షంగా వున్నారు
కోవూరు నియోజకవర్గ ప్రజానీకం సుఖ సంతోషాలతో వుండాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఆకాంక్షించారు. విడవలూరు మండలం రామతీర్ధం సమీపంలోని వెంకటనారాయణ పురంలో కనుము మత్స్యకార కుటుంబాలతో కలిసి ఆమె కనుము పండుగ సందర్బంగా నిర్వహించే పోలేరమ్మ పొంగళ్ళ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంప్రదాయ బద్ధంగా తలపై పొంగలి కుండ పెట్టుకొని పోలేరమ్మ అమ్మకు సమర్పించి అమ్మవారి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ తాను భారీ మెజారిటీ ఎమ్మెల్యే గెలవడంలో…

 
         
         
         
         
        