సూర్యకు ఐసీసీ హెచ్చరిక, పాక్ ఆటగాళ్లకూ విచారణ
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆసియా కప్ క్రికెట్‌ను రాజకీయంగా వేడెక్కించాయి. పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని ఉగ్రదాడి బాధితులకు అంకితమిస్తూ సూర్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. దీనికి ప్రతిస్పందనగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సూర్యపై విచారణ జరిపింది. గత వారం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ గ్రూప్-ఏ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్…
