యాదగిరిగుట్ట పాలకమండలి పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ తరహాలో పాలకమండలి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ముసాయిదా నిబంధనల్లో మార్పులు సూచిస్తూ ఆలయ పరిపాలన మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. బుధవారం తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పాలకమండలి నియామకంపై సమీక్ష నిర్వహించారు. రాజకీయ ప్రభావం లేకుండా ఆలయ పరిపాలన కొనసాగాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు…
