నిజాంపేటలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవం
నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 24వ పవిత్రోత్సవం బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు పంచాంగం రమణ చార్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ వేడుకలో స్వామివారి కృపను పొందేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని, వారి జీవితాల్లో శాంతి, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో…
