Dr. Anjaneya Goud receives a grand welcome in Erravalli during his visit to Gadwal weddings. He discussed local issues and public concerns.

ఎర్రవల్లిలో డాక్టర్ ఆంజనేయ గౌడ్ కు ఘనస్వాగతం

జోగులాంబ గద్వాల జిల్లా వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వచ్చిన స్పోర్ట్స్ పార్టీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ కు ఎర్రవల్లి చౌరస్తాలో ఘనస్వాగతం లభించింది. బాస్ శ్యామల హనుమంతు నాయుడు ఆహ్వానం మేరకు ఆయన వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి చౌరస్తా సర్పంచ్ అభ్యర్థి పల్లె రాజు మర్యాదపూర్వకంగా పూలమాలతో స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ స్థానిక సమస్యలపై వివరాలు…

Read More
SP Srinivas Rao visits Maoist Anita's family in Penchikalpet, inquires about their issues, and provides assistance.

మావోయిస్టు కుటుంబాన్ని పరామర్శించిన ఆసిఫాబాద్ ఎస్పీ

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు “పోరు కన్నా ఊరు మిన్న” కార్యక్రమంలో భాగంగా పెంచికల్పేట్ మండలం అగర్ గూడా గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి చెందిన మావోయిస్టు సభ్యురాలు చౌదరి అంకు బాయ్ అలియాస్ అనిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు నిత్యావసర సరకులు, దుస్తులు అందజేశారు. ప్రభుత్వం మావోయిస్టు కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని…

Read More
Four-year-old Ritvika dies as school Omni vehicle reverses. Student unions protest against negligence.

ఓమ్ని వాహనంపై నిర్లక్ష్యం.. చిన్నారి దుర్మరణం!

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌కు చెందిన ఓమ్ని వెహికల్‌ నిర్లక్ష్యంతో, నాలుగేళ్ల చిన్నారి రిత్విక ప్రాణాలు కోల్పోయింది. స్కూల్‌ వెహికల్‌ నుంచి దిగిన చిన్నారి ముందుకు నడుస్తుండగా, డ్రైవర్ వెహికల్‌ను రివర్స్‌ చేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించింది. చాలా స్కూళ్లలో ఓమ్ని వాహనాలకు సరైన అనుమతులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లు లేవని వారు ఆరోపిస్తున్నారు. టైర్లలో…

Read More
Hydra Commissioner Ranganath investigates Rajagopal Nagar plot dispute, assuring resolution within two months.

ప్లాట్ల వివాదంపై విచారణ – హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్లాట్ల కొనుగోలుదారులను కొందరు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. రెండు వారాల్లో లోతుగా పరిశీలించి ఇరువర్గాల అభిప్రాయాలను వింటామని, కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అన్ని విషయాలను విశ్లేషించిన తర్వాత, రెండు నెలల్లో సమస్య పరిష్కారం కావాలని ప్రయత్నిస్తామని వెల్లడించారు. రంగనాథ్ అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలాపూర్‌లో గల రాజగోపాల్ నగర్‌ను సందర్శించి, స్థానికులను కలుసుకున్నారు. ప్లాట్లను అక్రమంగా కబ్జా చేస్తున్నారంటూ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ ఫిర్యాదు…

Read More
Police destroyed 65 noisy motorcycle silencers with a road roller in Kamareddy, warning strict action against violators.

కామారెడ్డిలో 65 మోటార్‌సైకిల్ సైలెన్సర్ల ధ్వంసం

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శబ్ద కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టారు. ఇందిరా చౌక్ వద్ద ఇటీవల అధిక శబ్దం కలిగించే మోటార్‌సైకిళ్లను పోలీసులు గుర్తించారు. గత రెండు నెలలుగా పట్టణవ్యాప్తంగా సైలెన్సర్ తీసిన బైకులపై కేసులు నమోదు చేసి, మొత్తం 65 సైలెన్సర్లను సీజ్ చేశారు. ఈ సీజ్ చేసిన సైలెన్సర్లను ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేశారు. ఆయన మాట్లాడుతూ, అధిక శబ్దాన్ని ఉత్పత్తి చేసే మోడిఫైడ్…

Read More
On Gampa Govardhan's birthday, blankets and food packets were distributed to the poor as part of a charity event.

గంప గోవర్ధన్ పుట్టిన రోజు సేవా కార్యక్రమం

కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పుట్టిన రోజును పురస్కరించుకొని తన పార్టీ నాయకులు మరియు అనుచరులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ పార్టీ పట్టణ మైనారిటీ జనరల్ సెక్రెటరీ షేక్ అబ్దుల్ మాజీద్ ఆధ్వర్యంలో చేపట్టారు. గంప గోవర్ధన్ గారి పుట్టిన రోజును పురస్కరించుకొని రాత్రి 10 గంటల సమయంలో నిరుపేదలకు దుప్పట్లను, భోజన ప్యాకెట్లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా, కార్యక్రమం నిర్వహించిన వారు గంప గోవర్ధన్ గారి ఆదేశాల…

Read More
Rachakonda CP Sudheer Babu announced the recovery of 1400 mobile phones through the CEIR portal within a month.

రాచకొండ కమిస్నరేట్ 1400 మొబైల్ రికవరీ

రాచకొండ కమిస్నరేట్ పరిధిలో మొబైల్ ఫోన్లు కోల్పోయిన వారికి సిపి సుధీర్ బాబు కీలక సూచనలు ఇచ్చారు. ఆయన తెలిపిన ప్రకారం, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా వాటి లొకేషన్ ట్రేస్ చేసి రికవరీ చేయడం జరుగుతుంది. ఈ విధానంతో గత నెల రోజుల్లో రాచకొండ కమిస్నరేట్ పరిధిలో సుమారు 1400 మొబైల్ ఫోన్లు రికవర్ చేసినట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు. మొబైల్ రికవరీని మరింత సమర్ధవంతంగా చేయడానికి…

Read More