An ancient sword was discovered in a Tummuru farm. Villagers urge the government to conduct historical research as authorities remain unresponsive.

తుమ్మూరులో పురాతన కత్తి ఆవిష్కరణ గ్రామస్తుల ఆశ్చర్యం

ఒకప్పుడు రాజుల ఏలుబడిలో ఉన్న తుమ్మూరు గ్రామం నేడు చారిత్రక శేషాలను వెలికితీస్తోంది. అడపాదడపా రైతులు వ్యవసాయ పనులు చేస్తుండగా పురాతన వస్తువులు బయటపడుతున్నాయి. తాజాగా ఓ రైతు పొలం దున్నుతుండగా నాగలి కర్రకు పట్టి శిధిలావస్థలో ఉన్న పురాతన కత్తి వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా అదే ప్రాంతంలో పంచలోహాల వీరభద్రుని విగ్రహాలు బయటపడ్డ ఘటనలు ఉన్నాయి. కళ్యాణ స్వామి ఆలయ పరిసరాల్లో కాకతీయుల కాలానికి చెందిన అనేక చారిత్రక నిర్మాణాలు, సొరంగ మార్గాలు కనబడుతున్నాయి….

Read More
A leopard has been spotted near Brahmalakunta in Khammam district. Forest officials urge people to stay cautious.

బ్రహ్మలకుంట వద్ద చిరుతపులి సంచారం – అప్రమత్తంగా ఉండండి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మలకుంట గ్రామ పరిధిలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులి పాదముద్రలను పరిశీలించిన అధికారులు ఇది నిజమైన చిరుతపులి ఆనవాళ్లు అని నిర్ధారించారు. ఈ సమాచారం తెలియగానే గ్రామ ప్రజల్లో భయం నెలకొంది. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి బ్రహ్మలకుంట పరిసర ప్రాంతాల్లో మైక్ ప్రచారం నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా బయటికి వెళ్లొద్దని హెచ్చరించారు. వ్యవసాయ పనుల కోసం…

Read More
Shiva-Parvati Kalyanam will be held on February 10 at Erravalli in Jogulamba Gadwal district. Devotees are invited to participate in large numbers.

ఎర్రవల్లి ఈరన్న స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ఆర్. గార్లపాడు గ్రామంలోని ఈరన్న స్వామి దేవాలయంలో భక్తుల సమక్షంలో భగవంతుని శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ నిర్మాత స్వామి టి. ఉసేన్ అప్పస్వామి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10, 2025, సోమవారం ఉదయం 10:30 గంటలకు పునర్వాసు నక్షత్ర యుక్త మేష లగ్నంలో శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. శివపార్వతుల కళ్యాణానికి భక్తులను అధిక సంఖ్యలో హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ పవిత్ర వేడుకలో అఘోరాలు, నాగ…

Read More
Farmers in Toopran protest against illegal water transfer to farmhouses, warning of suicide if authorities fail to act.

తూప్రాన్‌లో అక్రమ నీటి తరలింపు పై రైతుల ఆందోళన

తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టు నుండి యావపూర్ ఫామ్ హౌస్‌లకు అక్రమంగా నీటిని తరలిస్తున్నారని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి గుట్టుచప్పుడు కాకుండా బీటీ రోడ్డును తవ్వి పైప్‌లైన్ వేశారని ఆరోపించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా నీటి తరలింపును సమర్థిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తమకు సరఫరా కావాల్సిన నీటిని ఫామ్ హౌస్‌లకు అక్రమంగా తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. తాము సాగు నీటి…

Read More
Dr. Anjaneya Goud receives a grand welcome in Erravalli during his visit to Gadwal weddings. He discussed local issues and public concerns.

ఎర్రవల్లిలో డాక్టర్ ఆంజనేయ గౌడ్ కు ఘనస్వాగతం

జోగులాంబ గద్వాల జిల్లా వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వచ్చిన స్పోర్ట్స్ పార్టీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ కు ఎర్రవల్లి చౌరస్తాలో ఘనస్వాగతం లభించింది. బాస్ శ్యామల హనుమంతు నాయుడు ఆహ్వానం మేరకు ఆయన వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి చౌరస్తా సర్పంచ్ అభ్యర్థి పల్లె రాజు మర్యాదపూర్వకంగా పూలమాలతో స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ స్థానిక సమస్యలపై వివరాలు…

Read More
SP Srinivas Rao visits Maoist Anita's family in Penchikalpet, inquires about their issues, and provides assistance.

మావోయిస్టు కుటుంబాన్ని పరామర్శించిన ఆసిఫాబాద్ ఎస్పీ

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు “పోరు కన్నా ఊరు మిన్న” కార్యక్రమంలో భాగంగా పెంచికల్పేట్ మండలం అగర్ గూడా గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి చెందిన మావోయిస్టు సభ్యురాలు చౌదరి అంకు బాయ్ అలియాస్ అనిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు నిత్యావసర సరకులు, దుస్తులు అందజేశారు. ప్రభుత్వం మావోయిస్టు కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని…

Read More
Four-year-old Ritvika dies as school Omni vehicle reverses. Student unions protest against negligence.

ఓమ్ని వాహనంపై నిర్లక్ష్యం.. చిన్నారి దుర్మరణం!

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌కు చెందిన ఓమ్ని వెహికల్‌ నిర్లక్ష్యంతో, నాలుగేళ్ల చిన్నారి రిత్విక ప్రాణాలు కోల్పోయింది. స్కూల్‌ వెహికల్‌ నుంచి దిగిన చిన్నారి ముందుకు నడుస్తుండగా, డ్రైవర్ వెహికల్‌ను రివర్స్‌ చేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించింది. చాలా స్కూళ్లలో ఓమ్ని వాహనాలకు సరైన అనుమతులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లు లేవని వారు ఆరోపిస్తున్నారు. టైర్లలో…

Read More