మార్లబీడు పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ధరూర్ మండలం మార్లబీడు గ్రామంలోని ఎంజేపీటిబీసిడబ్ల్యూఆర్ఇఎస్ బోయ్స్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థుల హాజరు, బోధనా ప్రమాణాలు, వసతి సదుపాయాలు, భోజన నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు పాఠశాల పరిస్థితుల గురించి వివరించగా, ప్రస్తుతం 564 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, 28 మంది ఉపాధ్యాయులు బోధన నిర్వహిస్తున్నారని తెలియజేశారు. కలెక్టర్ విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. భోజన నాణ్యత, హాస్టల్ సౌకర్యాలపై విద్యార్థులు వ్యక్తీకరించిన అసంతృప్తిని…
