చిలుకూరు ప్రధానార్చకుడు దాడి కేసులో కీలక విచారణ
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడికి సంబంధించి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, నిందితులు రామరాజ్య స్థాపన కోసం రంగరాజన్ ఆర్థిక సాయం అందించాలనే డిమాండ్ పెట్టారని తెలిపారు. ఆ డిమాండ్ ను ఆయన తిరస్కరించడంతో దాడికి పాల్పడ్డారని వివరించారు. ఈనెల…
