బీసీ కులగణనపై కవిత తీవ్ర విమర్శలు
బీసీ కులగణన అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ కుల సర్వేలో బీసీల తప్పుడు లెక్కలపై జరుగుతున్న చర్చను పక్కదోవ పట్టించడానికి, మోదీ బీసీనా? కాదా? అనే చర్చను సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని విమర్శించారు. ఈ సమయంలో రాహుల్ గాంధీని పక్కదారికి తీసుకెళ్లి, ఆయన మతం గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడటం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ఆగ్రహం కలిగించడమే…
