నల్గొండ చెరుకుపల్లిలో బర్డ్ ఫ్లూ కలకలం
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. గ్రామ శివారులో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్‌లో భారీగా కోళ్లు మృతి చెందాయి. ఈ ఘటన స్థానికంగా భయాందోళనకు గురి చేసింది. మొత్తం 13,000 కోళ్లు ఉండగా, ఒక్కసారిగా 7,000 కోళ్లు మరణించడంతో యజమాని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో తక్షణమే మృతి చెందిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టినట్లు యజమాని తెలిపారు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు….
