మద్ధికుంటలో బుగ్గ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్ధికుంట గ్రామ దట్టమైన అడవిలో కొలువుదీరిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. ఆలయం నిండా శివనామ స్మరణలతో మారుమోగింది. ముఖ్యంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. భక్తుల ఉత్సాహం మిన్నంటింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు మమ్మద్ షబ్బీర్ అలీ, లోయపాటి నర్సింగరావు, దేవాలయ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి, ప్రధాన అర్చకులు ప్రభాకర్ స్వామి, గణేష్ స్వామి పాల్గొన్నారు….
