లంబడిగూడ పంచాయతీ కార్యదర్శిపై అవినీతి ఆరోపణలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం లంబడిగూడ గ్రామపంచాయతీ కార్యదర్శి మడిశెట్టి శ్రీనివాస్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఇల్లు నిర్మించాలంటే రూ. 30,000 నుంచి 40,000 వరకు వసూలు చేస్తున్నాడని గ్రామస్థులు ఆరోపించారు. అధికారుల అండదండలతో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించాల్సిన శ్రీనివాస్, తన హోదాను దుర్వినియోగం చేస్తున్నాడని గ్రామస్థులు ఆరోపించారు. ఇటీవల ఓ బాధితుడిని ఫోన్ చేసి బెదిరించాడని,…
