సెప్టిక్ ట్యాంకర్ లో గంజాయి రవాణా – ఎక్సైజ్ పోలీసుల పట్టివేత
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భారీగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పుష్ప సినిమా తరహాలో సెప్టిక్ ట్యాంకర్ వాహనంలో 200 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసి, కోటి రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ పటాన్‌చేరు ఎక్సైజ్ పోలీసులు, జిల్లా టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించారు. గంజాయిని ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నుంచి…
