A free medical camp was held in Jainoor by Komaram Bheem Asifabad police, benefiting 300 people.

జైనూర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రతిమ హాస్పిటల్, కరీంనగర్ సహకారంతో జైనూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మైదానంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పేదల వద్దకే వైద్యం అనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు…

Read More
Rachakonda Commissioner G. Sudheer Babu conducted a surprise visit to Saroor Nagar PS to review security arrangements.

సరూర్నగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా పరిశీలించిన కమిషనర్

రాచకొండ కమిషనరేట్ కమిషనర్ జి. సుధీర్ బాబు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో జరుగుతున్న విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని, ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. స్థానికులు పోలీసుల సేవలపై ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. కమిషనర్ స్టేషన్ రికార్డులను పరిశీలించి, రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్, సీసీటీవీ నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. స్టేషన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో…

Read More
Congress Corporator Demands KCR’s Salary Refund

కేసీఆర్ జీతం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ కార్పొరేటర్ డిమాండ్

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జీతాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మినిస్టర్ క్వార్టర్స్‌లో స్పీకర్‌కు వినతిపత్రం అందజేశారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికై 14 నెలలు గడుస్తున్నా తన నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన ఏ చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కేసీఆర్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని…

Read More
A Mini Kisan Mela was organized in Vadiaram by Sehgal Foundation, honoring women farmers.

చేగుంటలో మహిళా రైతుల సాధికారతపై మినీ కిసాన్ మేళా

చేగుంట మండలం వడియారం గ్రామంలో సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైటెక్ సీడ్ కంపెనీ సహకారంతో మినీ కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతుల సాధికారత, వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఉంచారు. చేగుంట మండలంలోని 10 గ్రామాలను సెహగల్ ఫౌండేషన్ దత్తత తీసుకొని వివిధ వ్యవసాయ కార్యక్రమాలు చేపడుతుంది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా రైతులను, ప్రగతిశీల మహిళా రైతులను శాలువాలు, మెమెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు. మహిళా రైతులు…

Read More
Urban Money Pvt Ltd office opened in Kamareddy, offering various loan services.

కామారెడ్డిలో అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం ప్రారంభం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజినల్ మేనేజర్ మరియు తెలంగాణ రాష్ట్ర ఎండి బొడ్డు నరేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం పక్కన ఈ సంస్థ సేవలను ప్రారంభించడంతో స్థానిక ప్రజలకు అనేక రకాల లోన్లు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్ర ఎండి బొడ్డు నరేష్ మాట్లాడుతూ, సంస్థ ద్వారా పర్సనల్ లోన్,…

Read More

గద్వాలలో విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ

నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ ప్రోగ్రాంలో భాగంగా గద్వాల ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ పాల్గొన్నారు. కంటి సమస్యలను ముందుగానే గుర్తించి, విద్యార్థులకు అవసరమైన చికిత్స అందించాలని వారు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పిల్లలకు కంటి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అహారపు అలవాట్లు, మొబైల్…

Read More
The Supreme Court issued notices to key parties in the BRS defection case, including the Speaker, Assembly Secretary, and 10 defecting MLAs. The court has ordered a counter to be filed by March 25.

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం

బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. 10 మంది కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను ప్రస్తావిస్తూ, బీఆర్ఎస్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, అసెంబ్లీ సెక్రటరీ, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు, అలాగే 10 మంది ఎమ్మెల్యేలపై నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ పిటిషనర్ లు, ఎమ్మెల్యేలు…

Read More