డీలిమిటేషన్ పై కుట్రలతో కేటీఆర్-రేవంత్ కలయిక?
డీలిమిటేషన్ అంశంపై హైదరాబాద్‌లో జరగబోయే సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కలిసి సమావేశమయ్యేందుకు కుట్ర పన్నుతున్నారని బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా రక్షించేది రేవంత్ రెడ్డి అవుతారని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఆయన మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశానికి ఈ ఇద్దరూ హాజరయ్యారని గుర్తు చేశారు. త్వరలో జరగబోయే సమావేశంలో కూడా కలుసుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం అందిందని తెలిపారు….
