“మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు: ‘తెలంగాణ కౌరవుల చేతుల్లో… కాంగ్రెస్ పాలన విఫలం'”
తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంపై మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.అయన అభిప్రాయంలో రాష్ట్రం ప్రస్తుతం కౌరవుల చేతుల్లో ఉందని అన్నారు.మల్లారెడ్డి వెల్లడించినట్లుగా, కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు విఫలమయ్యాయని, ప్రజలకు అవసరమైన సేవలు అందించడం అసమర్ధతకు గురి అయిందని పేర్కొన్నారు.“తెలంగాణలో ముఖ్యమైన రంగాలన్నీ వెనుకబడిపోయాయి. ప్రభుత్వ హామీలు విఫలం అయ్యాయి. మళ్లీ ఈ పరిస్థితికి మార్పు తేవాలన్న ఉద్దేశంతో, ప్రజలను మద్దతు కోరుతూ మల్లారెడ్డి పేర్కొన్నారు.
