
శరన్నవరాత్రి ఉత్సవాలపై ఎమ్మెల్యే పవార్ రామారావు సూచనలు
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం సరస్వతి అమ్మవారి క్షేత్రంలో రాజన్న అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం అయితే ఊరుకునేది లేదని ఆలయ అధికారులను హెచ్చరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి, భక్తులు రానున్న…