
మిర్యాలగూడలో అక్రమ నిర్మాణం కూల్చివేత
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సాగర్ రోడ్ పై అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని మున్సిపల్, రెవిన్యూ అధికారులు నేలమట్టం చేశారు. ఈ నిర్మాణం మున్సిపల్ చైర్మన్ అనుచరులకు చెందిన స్థలంగా భావిస్తున్నారు. సర్వే నంబర్ 992లో ఉన్న సుమారు పదిగుంటల భూమి గ్రామ కంఠం భూమిగా గుర్తించబడింది. షెడ్డు నిర్మాణానికి అనుమతులు లేవని గతంలోనే నోటీసులు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. నోటీసులకు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో తెల్లవారుజామున భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత చేపట్టారు. మున్సిపల్…