ఉప్పల్ నాచారంలో వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ ప్రారంభం
ఉప్పల్ నియోజకవర్గం నాచారం లో వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని సూపర్ మార్కెట్‌ను ప్రారంభించారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, వాల్యూ జోన్‌ను ప్రారంభించడం తనకు సంతోషకరంగా ఉందని అన్నారు. సాంకేతికంగా విడిపోయిన తెలుగువాళ్లు అంత ఒకటే అనడంతో పాటు, అన్ని దేశాలలో తెలుగువారు…
