Prajavani program held in Ramayampet resolved 304 issues from 419 applications, with 115 pending. Citizens urged to utilize this platform for grievances.

రామాయంపేటలో ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన

మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ, కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి 419 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అందులో 304 సమస్యలను ఇప్పటివరకు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. మిగిలిన 115 దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల…

Read More
A man named Chintala Siddhiramulu committed suicide by hanging from an electric pole in Mirjapalli village, Medak district. Police have initiated an investigation.

మిర్జాపల్లి గ్రామంలో విద్యుత్ స్థంభానికి ఉరివేసుకొని ఆత్మహత్య

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలో ఒక వ్యక్తి విద్యుత్ స్థంభానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన ప్రకారం, మిర్జాపల్లి గ్రామానికి చెందిన చింతల సిద్ధిరాములు, ఒక పెయింటర్‌గా పని చేస్తున్నాడు. గత రాత్రి అర్ధారాత్రి సమయంలో, ఇంటి పక్కన ఉన్న విద్యుత్ స్థంభానికి ఉరివేసుకుని ఆయన మరణించాడు. స్థానికులు ఈ విషయం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు….

Read More
A gas cylinder explosion in Peta Patagadda village left a family homeless, destroying valuables and documents. Victims seek government support.

గ్యాస్ సిలిండర్ పేలుడుతో పూరి గుడిసె దగ్ధం

చిన్న శంకరంపేట మండలం పేట ప్యాటగడ్డ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రాములు కుటుంబానికి చెందిన పూరి గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో శ్రీకాంత్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గుడిసె పూర్తిగా దగ్ధమవడంతో ఆ కుటుంబం పూర్తిగా వీధిన పడింది. బాధిత కుటుంబ సభ్యులు వివరిస్తూ, ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంటిలోని బట్టలు, వస్తువులు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. ఈ ప్రమాదంలో…

Read More
MRPS leaders protested in Medak against Amit Shah's remarks on Ambedkar, demanding his suspension from BJP and intensifying agitation if ignored.

మెదక్‌లో అమిత్ షా వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ నిరసన

మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ నాయకులు దళిత సంఘాల నేతల ఆధ్వర్యంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్ మాదిగ ఆధ్వర్యంలో జోగిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి, అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ,…

Read More
Congress leader Yadagiri Yadav assures Indiramma houses for all eligible, highlighting the party’s welfare schemes and commitment to the poor.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ

నార్సింగ్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇల్లు సర్వేను పీసీసీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పథకం ద్వారా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ పథకం కింద నార్సింగ్ మండలంలోని పలు…

Read More
Medak district Stree Nidhi distributed ₹36 crore in loans, with plans to provide an additional ₹43 crore by March 31, ensuring better recovery rates.

మెదక్ జిల్లాలో 78 కోట్ల స్త్రీనిధి రుణ ప్రణాళికలు

మెదక్ జిల్లాలో స్త్రీనిధి ద్వారా మొత్తం 78 కోట్ల 19 లక్షల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 36 కోట్ల రూపాయల రుణాలు అందించడం జరిగిందని రీజనల్ మేనేజర్ గంగారం తెలిపారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో రుణాలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. గతంలో అందించిన రుణాలకు సంబంధించి 75% రికవరీ చేయడం జరిగిందని, మిగిలిన 43 కోట్ల రూపాయల రుణాలను మూడు నెలల్లో అందించే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు….

Read More
Sanitation workers protesting for minimum wage hike were arrested en route to a rally at Indira Park, vowing to continue their fight for justice.

వేతన పెంపు కోసం మహాసభకు బయలుదేరిన కార్మికుల అరెస్ట్

పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ ఇంద్ర పార్క్ లో నిర్వహించనున్న మహాసభకు వెళ్తున్న కార్మికులను నిజాంపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ చర్యను కార్మికులు తీవ్రంగా ఖండించారు. కార్మికులు మాట్లాడుతూ, మురికివాడల్లో పనిచేసే తమను ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తమ జీతాలు మాత్రం చాలా తక్కువగా ఉండి, జీవనం సులభంగా…

Read More