
మెదక్ మోడల్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై దీన్ని ప్రారంభించారు. పాఠశాల ప్రిన్సిపాల్ వాని, ఉపాధ్యాయులు, సిబ్బంది కలెక్టర్‌కు స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థుల ప్రయోగాలను పరిశీలించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంలో ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు చాలా ఉపయోగకరమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను పరిశీలించి, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ…