చిన్న శంకరంపేట కస్తూర్బా హాస్టల్‌లో వైద్య శిబిరం
చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల హాస్టల్‌లో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆదేశాల మేరకు ఈ శిబిరం ఏర్పాటు చేశారు. మండల వైద్యాధికారి సాయి సింధు నేతృత్వంలో 50 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చలికాలం కారణంగా విద్యార్థుల వద్ద తలెత్తిన దురద సమస్యకు ప్రత్యేక మందులు అందించారు. హాస్టల్…
