రామాయంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభం
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 950 గ్రాడ్యుయేట్ ఓటర్లు, 81 మంది ఉపాధ్యాయ ఓటర్లు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటింగ్ ప్రక్రియను క్రమశిక్షణగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పరంగా 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లోకి తీసుకురాగా, పోలీసులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటల…
