రామాయంపేట రహదారి పై బొలెరో వాహన ప్రమాదం
మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వెళ్తున్న బొలెరో వాహనం, ముందున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం కారును ఢీకొట్టడంతో, కారు పాల్టీ అవి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. బొలెరో వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయాడు. ప్రమాదాన్ని తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు గంటల శ్రమతో డ్రైవర్‌ను వాహనంలోనుంచి…
