పాలాట అడవిలో ఎర్ర మట్టి అక్రమ తవ్వకం, రవాణా వివాదం
మనోహరాబాద్ మండలం పాలాట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎర్ర మట్టి అక్రమ తవ్వకం జరుగుతోంది. జేసీబీ యంత్రాల సహాయంతో తవ్విన మట్టిని టిప్పర్ల ద్వారా రవాణా చేస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే జరుగుతున్న ఈ తవ్వకాలను అటవీ శాఖ అధికారులు చూస్తూ కూడా చర్యలు తీసుకోకపోవడం విమర్శల పాలవుతోంది. స్థానికుల ఫిర్యాదుల ప్రకారం, ఈ తవ్వకాలు అటవీ ప్రదేశాన్ని హాని కలిగించే ప్రమాదం ఉందని, ఈ అంశంపై ఫారెస్ట్ అధికారులకు…
