షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్ నేతలు
మాచారెడ్డి గ్రామ మాజీ ఎంపీటీసీ రావుల వినోద ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహమ్మద్ షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అంటేనే షబ్బీర్ అలీ, షబ్బీర్ అలీ అంటేనే కాంగ్రెస్ అని, గత 40 ఏళ్లుగా ఆయన పార్టీ కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ అసెంబ్లీలో షబ్బీర్ అలీ పేరును ప్రస్తావించారని, బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని పలుమార్లు ఆహ్వానించారని తెలిపారు. అయినప్పటికీ…
