
భక్తుల ఉల్లాసంతో దుర్గామాత జాతర
శోభయాత్ర..బోనాల ఊరేగింపు శివ శివసత్తు ల పూనకాలు..పోతరాజుల విన్యాసాలు .. దుర్గామాత కళ్యాణం పట్టణంలో భక్తి పారవశ్యం ఉప్పొంగింది. జిల్లా కేంద్రం బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గామాత జాతర ఉత్సవాలు బుధవారం మూడో రోజు కొనసాగాయి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బోడ్రాయి, వాస్తు గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నెహ్రూ పార్కు వద్దకు చేరుకున్నారు. పొట్టేళ్ల రధం పై అమ్మవారి శోభాయాత్ర కనుల పండగగా సాగింది దుర్గామాతకు బోనాలు సమర్పించేందుకు వేలాదిగా మహిళలు తరలివచ్చారు అర్ధరాత్రి 12…