
హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటు
అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్‌డొనాల్డ్స్, తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో గ్లోబల్ ఇండియా ఆఫీస్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ద్వారా 2,000 మందికి పైగా ఉద్యోగాలు అందించనున్నట్లు మెక్‌డొనాల్డ్స్ ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మెక్‌డొనాల్డ్స్ చైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీతో పాటు పలువురు ప్రతినిధులు సమావేశమై ఈ ఒప్పందంపై చర్చించారు. ఈ ఒప్పందం ద్వారా మెక్‌డొనాల్డ్స్ తమ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు అవసరమైన…